Sunday, January 19, 2025

ఉప్పల్ లో టీమిండియా నెట్ ప్రాక్టీస్.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా నెట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. మంగళవారం స్టేడియంలో భారత ఆటగాళ్లు చమటోడ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, కెఎల్ రాహుల్ లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేసిన వీడియోను బిసిసిఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. తర్వాత రెండో టెస్టు మ్యాచ్ వైజాగ్ లో జరగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News