Wednesday, January 22, 2025

కొత్త జెర్సీలో మెరిసిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

లండన్: డబ్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా కోసం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కొత్త జెర్సీలను రూపొందించిన విషయం తెలిసిందే. అడిదాస్ సంస్థ బిసిసిఐ కిట్ స్పాన్సర్‌గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బైజూస్ సంస్థ తప్పుకోవడంతో అడిదాస్‌తో జెర్సీలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు అడిదాస్ సంస్థ టీమిండియాకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇదిలావుంటే డబ్లూటిసి ఫైనల్‌తో ఈ ఒప్పందం అమలులోకి రానుంది. కాగా మూడు ఫార్మాట్‌ల కోసం వేర్వేరు జెర్సీలను అడిదాస్ సంస్థ తయారు చేసింది.

కొత్త జెర్సీలకు సంబంధించిన ఫొటోలను అడిదాస్ సంస్థ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు ధరించిన కొత్త జెర్సీలను సోమవారం బిసిసిఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. సీనియర్లు పుజారా, రోహిత్, విరాట్, అశ్విన్, రహానె, జడేజా తదితరులు కొత్త జెర్సీలను ధరించి ఫొటోలు దిగారు. వీటిని బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News