Monday, December 23, 2024

టీమిండియా కొత్త జెర్సీల విడుదల

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీలను ఆవిష్కరించారు. రానున్న డబ్లూటిసి ఫైనల్ నేపథ్యంలో ఈ జెర్సీలను విడుదల చేశారు. టెస్టులు, టి20, వన్డే ఫార్మాట్‌లకు మూడు వేర్వేరు జెర్సీలను రూపొందించారు. టీమిండియా ఆఫిషియల్ కిట్ స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్ సంస్థనే జెర్సీకి కూడా స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సర్ ఉన్న సంస్థ జెర్సీని కూడా తయారు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కొత్త జెర్సీలను అడిదాస్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News