Thursday, December 19, 2024

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్: మూడో ర్యాంక్‌లోనే టీమిండియా..

- Advertisement -
- Advertisement -

Team India on Spot 3 in ICC ODI Rankings

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం తాజాగా ప్రకటించిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను టీమిండియా 3-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ మూడు అదనపు రేటింగ్ పాయింట్లను దక్కించుకుంది. దీంతో భారత పాయింట్ల సంఖ్య 111కి చేరింది. అయితే పాయింట్లు పెరిగిన టీమిండియా ర్యాంకింగ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. భారత్ ప్రస్తుతం మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇక న్యూజిలాండ్ 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ 119 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 107 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఐదు, ఆరు ర్యాంక్‌లలో నిలిచాయి.

Team India on Spot 3 in ICC ODI Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News