Tuesday, January 21, 2025

సమరోత్సాహంతో టీమిండియా

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే, నేడు తొలి వన్డే

హరారే: జింబాబ్వేతో గురువారం జరిగే తొ లి వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. కెఎల్.రాహుల్ సారథ్యంలోని భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జిం బాబ్వేతో తలపడనుంది. తొలి మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయ. ఈ సిరీస్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, అశ్విన్, జడేజా, షమి, రిషబ్, సూర్యకుమా ర్ తదితరులు లేకుండానే భారత్ సిరీస్‌లో పాల్గొంటుంది. అయితే రాహుల్ కెప్టెన్సీలో ని టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. సీనియ ర్లు లేకున్నా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.

రా హుల్‌తో పాటు శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావ న్, రాహుల్ త్రి పాఠి, సంజు శాంసన్, దీపక్ హుడా, శార్దూల్, దీపక్ చాహర్ వంటి మ్యా చ్ విన్నర్లు జట్టులో ఉన్న విషయం తెలిసిం దే. వీరిలో ఏ ఇద్దరు రాణించినా టీమిండియాకు విజయం నల్లేరుపై నడకే. ఇక కెప్టెన్ రాహుల్‌కు సిరీస్ కీలకంగా మారింది. గా యాలతో చాలా కాలంగా రాహుల్ టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి అతని బ్యాటింగ్ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. త్రిపాఠికి కూడా సిరీస్ కీలకంగా మారింది. సంజు శాంసన్ మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. దీపక్ హు డా కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యా డు. బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చే యాలనే లక్షంతో కనిపిస్తున్నారు.

జోరుమీదుంది..

మరోవైపు ఆతిథ్య జింబాబ్వే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇటీవల బలమైన బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్‌పై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తోంది. సికందర్ రజా, మదెవెరె, కెప్టెన్ రెగిస్ చకబవా, బ్రాడ్ ఎవాన్స్ తదితరులతో జింబాబ్వే బలంగానే ఉంది. దీంతో భారత్‌కు సిరీస్‌లో గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News