Wednesday, January 22, 2025

డబ్ల్యుటిసి ఫైనల్…. జట్టును ప్రకటించిన బిసిసిఐ… సూర్య ఔట్.. రహానే ఇన్

- Advertisement -
- Advertisement -

లండన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం బిసిసిఐ టీమిండియా ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. డబ్ల్యుటిసి ఫైనల్  జూన్ 7 నుంచి 11 మధ్య టీమిండియా- ఆసీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ఫలితం తేలకుంటే 12వ తేదీన రిజర్వ్ డేగా ప్రకటిస్తారు. టీమిండియాలో ఒక మార్పు తీసుకొచ్చారు. ఫామ్‌లో లేని సూర్యాకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి రహానేకు చోటు కల్పించారు. ఈ ఐపిఎల్‌లో రహానే చెన్నైసూపర్ కింగ్స్ తరపున అదరగొడుతున్నాడు. తెలుగు కుర్రాడు కెఎస్ భరత్‌ను వికెట్ కీపర్‌గా తీసుకున్నారు.
భారత జట్టు సభ్యుల వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్)
శుభ్‌మన్ గిల్
ఛటేశ్వరా పుజారా
విరాట్ కోహ్లీ
అజింక్య రహానే
కెఎల్ రాహుల్
కెఎస్ భరత్(కీపర్)
రవిచంద్రన్ అశ్విన్
రవీంద్ర జడేజా
మహ్మాద్ షమీ
మహ్మాద్ సిరాజ్
అక్షర పటేల్
ఉమేష్ యాదవ్
శార్థూల్ టాకూర్
జయ్‌దేవ్ ఉనద్కత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News