Monday, January 20, 2025

ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు(బుధవారం) భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులు టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో భారత ఆటగాళ్లు పార్క్ హయాత్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. అయితే, ఇందులో సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చహల్, శార్దుల్ ఠాకూర్ లు నజీర్ ఖాన్ ఇంట్లో జూ.ఎన్టీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూర్యకుమార్, చాహల్ లు ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’లో ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ వాసి అయిన నజీర్ ఖాన్ గతంలో ఖరీదైన కార్ కలెక్షన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసే ఉంటుంది. కాగా, టీమిండియా ఆటగాళ్లు మంగళవారం ఉప్పల్ స్టేడియంలో సాధన చేయనున్నారు. న్యూజిలాండ్ టీమ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News