Wednesday, January 22, 2025

టీమిండియా క్రికెటర్ల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..

- Advertisement -
- Advertisement -

Team India Players New Year Celebrations in Centurion

సెంచూరియన్: టీమిండియా క్రికెటర్లు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తల నడుమ సంబరాల్లో పాల్గొన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలో క్రికెటర్లు కేక్‌ను కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అంతేగాక ఒకరికొకరూ కేక్‌ను తినిపిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదం పొంచి ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్‌లోనే ఉంటున్నారు. ఇక సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా భారత క్రికెటర్ల ఆరోగ్య భద్రత కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా, ఒకప్పుడూ నూతన సంవత్సర వేడుకలను క్రికెటర్లు పెద్ద ఎత్తున జరుపుకునే వారు.

కానీ, ఈసారి మాత్రం అలాంటి సందడి ఏమీ లేకుండా సాదాసీదాగానే వేడుకలను నిర్వహించారు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇతర ఆటగాళ్లు తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం సాఫీగా సాగిపోవాలని వారు ఆకాంక్షించారు. కరోనా మహమ్మరి నుంచి బయటపడి కొత్త ఏడాదిలో ఆనందంగా గడపాలని కోహ్లి పేర్కొన్నాడు. ఇక టీమిండియా క్రికెటర్లు తమ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Team India Players New Year Celebrations in Centurion

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News