Thursday, January 23, 2025

టీమిండియా ముమ్మర సాధన

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే ఐదో, చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా మంగళవారం సాధన ప్రారంభించింది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 31తో సొంతం చేసుకుంది. దీంతో ఆఖరి మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది.

సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా తిరిగి చేరడంతో జట్టు మరింత బలోపేతంగా తయారైంది. కాగా, మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. సీనియర్లు అశ్విన్, జడేజా, బుమ్రాలతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు సాధనలో పాల్గొన్నారు. వీరితో పాటు యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, జురెల్ తదితరులు కూడా నెట్స్‌లో చెమటోడ్చారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్ల సాధన కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News