చెన్నై: ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో చారిత్రక విజయం సాధించిన టీమిండియాలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించిన భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, చటేశ్వర్ పుజారాలు ఈ సిరీస్‌లో చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక చివరి టెస్టులో అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా మరోసారి సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న క్రికెటర్లు సాధనను కూడా ఆరంభించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి చేరికతో జట్టులో మరింత ఉత్సాహం నెలకొంది. విరాట్ చేరడంతో బ్యాటింగ్ బలంగా మారింది. ఇక జట్టు సభ్యుల్లో జోష్ నింపడంలో కోహ్లికి ఎవరూ సాటిరారు. అతని రాకతో ఇటు సీనియర్లు, అటు జూనియర్లలో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది.
దీనికి తోడు సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడంతో భారత్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పుజారా, రహానె, రోహిత్, కోహ్లి, అశ్విన్, ఇషాంత్, బుమ్రా వంటి సీనియర్లతో టీమిండియా పటిష్టంగా తయారైంది. ఇక శుభ్‌మన్ గిల్, పంత్, శార్దూల్, సిరాజ్, సుందర్ వంటి యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. ఇషాంత్ చేరికతో బౌలింగ్ మరింత బలోపేతంగా తయారైంది. ఇలాంటి స్థితిలో సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా తహతహలాడుతోంది.
Out and about at The Chepauk after 6 days of quarantine.#TeamIndia pic.twitter.com/mt7FShNFrb
— BCCI (@BCCI) February 1, 2021
Team India players start practice against Eng test