Sunday, January 19, 2025

సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: భారత్-ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో విశాఖపట్నం ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు గురువారం సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మలతో టీమిండియా బృందం సింహాచలం దేవాలయంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు. క్రికెటర్లను వేదపండితులు, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో ఈ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. విశాఖపట్నం స్టేడియాన్ని ఈ మ్యాచ్‌ కోసం సర్వం సిద్దం చేశారు. టీమిండియాకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా ఆసీస్‌కు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News