Friday, January 24, 2025

జోరుగా.. హుషారుగా టీమిండియా సాధన

- Advertisement -
- Advertisement -

దుబాయి : ఆసియాకప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. దుబాయి స్టేడియంలో శుక్రవారం భారత ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇటు బౌలర్లు, అటు బ్యాటర్లు సాధనలో నిమగ్నమయ్యారు. సీనియర్లు విరాట్ కోహ్లి, భువనేశ్వర్, అశ్విన్, కార్తీక్, జడేజాలతో పాటు యువ బౌలర్లు అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్, బిష్ణోయ్, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తదితరులు సాధనలో పాల్గొన్నారు. తాత్కాలిక కోచ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఆటగాళ్ల సాధన కొనసాగింది. ఆసియాకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆదివారం ఆడనుంది. దాయాది పాకిస్థాన్‌తో ఈ మ్యాచ్ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News