దుబాయి: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌కు బుధవారం తెరలేవ నుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అయితే భారత్ తన మ్యాచ్‌లను యుఎఇలోని దుబాయిలో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. అంతేగాక న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు కూడా గ్రూప్‌ఎలో చోటు దక్కింది. భారత్ తన తొలి మ్యాచ్‌ను గురువారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 23న పోరు జరుగనుంది. ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. కాగా, టోర్నమెంట్ కోసం టీమిండియా ఇప్పటికే దుబాయి చేరుకుంది. ఆదివారం సాధన ప్రారంభించింది. ఇక సోమవారం కూడా దుబాయి స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే సందడి సందడిగా గడిపారు. ఈ మెగా టోర్నమెంట్‌కు టీమిండియా ప్రత్యేక ఆకర్షణగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. కొంతకాలంగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న భారత్ ఈ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. దీని కోసం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఆటగాడు సాధనలో చెమటోడ్చుతున్నాడు.
జోరుగా.. హుషారుగా టీమిండియా సాధన
- Advertisement -
- Advertisement -
- Advertisement -