Wednesday, January 22, 2025

సాధనే..సాధన

- Advertisement -
- Advertisement -

లండన్: కొన్ని రోజులుగా పొట్టి క్రికెట్ ఐపిఎల్‌లో మునిగి తేలిన టీమిండియా క్రికెటర్లు ఇప్పుడూ సంప్రదాయ టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించారు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్లూటిసి ఫైనల్ కోసం భారత క్రికెటర్లు సన్నద్ధం అవుతున్నారు. జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే సాధన ప్రారంభించింది. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, ఉమేశ్ యాదవ్, చటేశ్వర్ పుజారా, సిరాజ్, అక్షర్ పటేల్, ఉనద్కట్‌లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తదితరులు కొన్ని రోజుల క్రితమే లండన్ చేరుకున్నారు.

ఐపిఎల్ టోర్నీ ముగియడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, రహానె, షమి తదితరులు కూడా ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లారు. ఇక ద్రవిడ్ పర్యవేక్షణలో ఇప్పటికే భారత ఆటగాళ్లు సాధన ప్రారంభించారు. సహాయక కోచ్‌లు కూడా క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సీనియర్, జూనియర్ క్రికెటర్లందరూ ప్రస్తుతం సాధనలో నిమగ్నమయ్యారు. దీంతో ఓవల్ మైదానంలో సందడి వాతావరణం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News