Sunday, December 22, 2024

భారత్ కు చేరుకున్న టీమిండియా… ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

ముంబై: 13 సుదీర్ఘ విరామం తర్వాత  ఐసిసి టి20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గురువారం మధ్యాహ్నం 11 గంటలకు భారత క్రికెటర్లు కలుస్తారు. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక ప్రదర్శనతో అలరించింది. ఇదే క్రమంలో తన ఖాతాలో రెండో టి20 వరల్డ్‌కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లతో ముంబై నగరంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది.

గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ సంబరాలు ప్రారంభమవుతాయాని బిసిసిఐ కార్యదర్శి జై షా ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. ఈ విజయోత్సవాల్లో అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు.  గతంలో 2007లో భారత్ టి20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడూ కూడా ముంబైలో ఆటగాళ్లతో భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కాగా, గురువారం కూడా ముంబైలో ఇలాంటి ఉత్సవాలనే నిర్వహించేందుకు బిసిసిఐ భారీ ఏర్పట్లు చేస్తోంది. తర్వాత ప్రపంచ కప్ విజేత టీమ్ ముంబైకి చేరుకొని విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటుంది. ఈ వేడుకలు ముగిసిన తర్వా క్రికెటర్లు తమ తమ ఇళ్లకు పయనమవుతారు. కాగా, భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో ఓపెన్ పరేడ్ చేయనున్నారు. దారి పొడవున వీరికి అభిమానులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే భారత్ విశ్వవిజేతగా నిలువవడంతో దేశంలో సంబరాలు మిన్నంటిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News