Thursday, December 19, 2024

హైదరాబాద్ చేరుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే కోసం ఆతిథ్య టీమిండియా సోమవారం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు సభ్యులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లితో సహా జట్టు సభ్యులందరూ హైదరాబాద్ చేరారు. ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులు టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు.

అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో భారత ఆటగాళ్లు పార్క్ హయాత్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. భారత్ మంగళవారం ఉప్పల్ స్టేడియంలో సాధన చేయనుంది. న్యూజిలాండ్ టీమ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య బుధవారం తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిలువనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News