Wednesday, December 25, 2024

లండన్ లో జోరుగా..హుషారుగా టీమిండియా..

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం టీమిండియా క్రికెటర్లు ఒకవైపు సాధన మరోవైపు షాపింగ్‌లతో సరదగా గడుపుతున్నారు. ఇంగ్లండ్‌తో కిందటి సిరీస్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన టెస్టు మ్యాచ్‌ను ఆడేందుకు టీమిండియా ఇప్పటికే లండన్ చేరుకుంది. జులై ఒకటి నుంచి ఈ టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇక తాజాగా సిరీస్ కోసం భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఇంగ్లండ్ చేరుకున్నాడు. అతను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సోమవారం లండన్‌లో ల్యాండయ్యాడు. ఇక భారత క్రికెటర్లు ఒకవైపు సాధన చేస్తూనే తీరిక సమయాల్లో లండన్‌లో వీధుల్లో షికార్లు చేస్తున్నారు. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

వీరు కూడా వారితో ఫొటోలు దిగుతూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇదిలావుండగా టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియా లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌ను ఆడనుంది. అనంతరం జులై ఒకటి నుంచి ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో భారత్ మరో మూడు టి20, 3 వన్డే మ్యాచులు ఆడుతుంది. ఇక ఇంగ్లండ్ సిరీస్ జరుగుతున్న సమయంలోనే భారత్‌కు చెందిన మరో జట్టు ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సీనియర్ ఆటగాడు వివిఎస్.లక్ష్మణ్ సిరీస్‌లో టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.

Team India reached London for Test Match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News