Wednesday, January 22, 2025

తిరువనంతపురం చేరుకున్న భారత్, సౌతాఫ్రికా..

- Advertisement -
- Advertisement -

Team India reached to Thiruvananthapuram for T20

తిరువనంతపురం: సౌతాఫ్రికాతో జరిగే తొలి టి20 మ్యాచ్ కోసం టీమిండియా సోమవారం తిరువనంతపురం చేరుకుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా త్రివేండ్రం బయలుదేరి వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్లు ఇక్కడికి చేరుకున్నారు. తిరువనంతపురం విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అయితే విమానాశ్రయం బయట మాత్రం స్థానిక క్రికెట్ సంజు శాంసన్‌కు చెందిన అభిమానులు నిరసనకు దిగారు. తమ స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించక పోవడంపై అతని అభిమానులు నిరసన ప్రదర్శన చేశారు.
సౌతాఫ్రికా టీమ్ వచ్చేసింది..
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు కూడా సోమవారం భారత్‌కు చేరుకుంది. దుబాయి నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ తిరువనంతపురం చేరింది. విమానాశ్రయంలో సౌతాఫ్రికా జట్టుకు కేరళ క్రికెట్ సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కెప్టెన్ బవుమాతో పాటు ఇతర సభ్యులకు తిలకం దిద్ది ఆహ్వానం పలికారు. భారత్ పర్యటనలో సౌతాఫ్రికా మూడు టి20లు మరో 3 వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం తిరువనంతపురంలో తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం కేరళ క్రికెట్ సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ఇటు భారత్ అటు సౌతాఫ్రికా సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Team India reached to Thiruvananthapuram for T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News