Friday, December 27, 2024

అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

TeamIndia

ముంబై: భార‌త క్రికెట్ జ‌ట్టు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో… ప్ర‌త్యేకించి వ‌న్డే క్రికెట్‌లో ఏ ఒక్క దేశ జ‌ట్టుకు కూడా అంద‌నంత ఎత్తుకు ఎదిగింది. అంత‌ర్జాతీయ వ‌న్డే ఫార్మాట్‌లో 300 విజ‌యాల‌ను సాధించిన జ‌ట్టుగా టీమిండియాకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఇప్ప‌టికే ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా గుర్తింపు పొందిన టీమిండియా ఆదివారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విజ‌యంతో 300 విక్ట‌రీ మార్కును అందుకుంది. ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా టీమిండియా కొన‌సాగుతుండ‌గా… రెండో స్థానంలో 257 విజ‌యాల‌తో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో 247 విజ‌యాల‌తో వెస్టిండీస్ జ‌ట్లు ఉన్నాయి. స‌మీప భ‌విష్య‌త్తులో టీమిండియా రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం దాదాపుగా ఏ జ‌ట్టుకూ సాధ్యం కాద‌నే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News