ముంబై: సొంత గడ్డపై టీమిండియా ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు ఖరారు చేసింది. 2024-25 మధ్య భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే సిరీస్‌ల వివరాలను బిసిసిఐ వెల్లడించింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో సొంత గడ్డపై భారత్ సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ టీమ్ భారత్‌లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ ఈ క్రమంలో రెండు టెస్టుల్లో భారత్‌తో తలపడుతుది. తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో, రెండో టెస్టు 27 నుంచి కాన్పూర్‌లో జరుగుతుంది. అంతేగాక సిరీస్‌లో బంగ్లా మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. అక్టోబర్‌లో న్యూజిలాండ్ టీమ్ భారత పర్యటనకు రానుంది. ఈ క్రమంలో కివీస్ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి టెస్టు అక్టోబర్ 16 నుంచి బెంగళూరులో, రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో, మూడో చివరి టెస్టు నవంబర్ ఒకటి నుంచి ముంబైలో జరుగుతుంది. ఆ తర్వాత 2025 జనవరిలో ఇంగ్లండ్ టీమ్ భారత్‌కు రానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఐదు టి20లు, మరో మూడు వన్డేలు ఆడనుంది. చెన్నైలో జనవరి 22న జరిగే తొలి టి20తో సిరీస్‌కు తెరలేవనుంది. కాగా బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 12న జరిగే మూడో టి20 మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఉప్పల్‌లో బంగ్లాతో టి20….. టీమిండియా షెడ్యూల్ ఖరారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -