సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచాడు. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పంత్ 33 బంతుల్లో 61 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్ మైదానం వీడాడు. కెఎల్ రాహుల్ 13 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. విరాట్ కోహ్లీ ఆరు పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నితీశ్ కుమార్‌రెడ్డి నాలుగు పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో కమ్నీస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(08), వాషింగ్టన్ సుందర్(06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీయగా ప్యాట్ కమ్నీస్, వెబ్‌స్టర్ చెరో ఒక వికెట్ తీశారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 185
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 181