Sunday, January 5, 2025

టీమిండియా 185 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 72.2 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌటైంది. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డివిరిచాడు. బోలాండ్ బౌలింగ్ ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు గజగజవణికిపోయారు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్లు వంద బంతులు ఎదుర్కొకుండా వెనుదిరిగారు. భారత బ్యాట్స్ మెన్లలో రిషబ్ పంత్ (40), రవీంద్ర జడేజా(26), బుమ్రా(22), శుబమన్ గిల్(20), విరాట్ కోహ్లీ(17), వాషింగ్టన్ సుందర్(14),  యశస్వి జైస్వాల్(10), కెఎల్ రాహుల్(04), ప్రసిద్ధ్ కృష్ణ(03), సిరాజ్(03 నాటౌట్) పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కమ్నీస్ రెండు వికెట్లు, నాథన్ లయాన్ ఒక వికెట్ తీశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News