Wednesday, January 22, 2025

టీమిండియా 198 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

Team India Scored 198 runs in 2nd Innings

కేప్‌టౌన్: న్యూలాండ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 67.3 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ఇప్పటివరకు 212 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు.  భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ(29), కెఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్(07), ఛటేశ్వరా పూజారా(09), అంజిక్య రహాన్ (01), అశ్విన్(07), టాకూర్ (05), బుమ్రా రెండు పరుగులు చేసి మైదానం వీడారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జన్‌సేన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కగిసో రబడా, ఎంగిడి చెరో మూడు వికెట్లు తీశారు. భారత్-సౌతాఫ్రికా చెరో ఒక మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210
ఇండియా తొలి ఇన్నింగ్స్: 223

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News