Wednesday, January 22, 2025

హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన పూజారా, అయ్యర్

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: జహుర్ అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫస్ట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 68 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 216 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఛటేశ్వరా పూజారా, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. పూజారా 141 బంతుల్లో 62 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 99 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఐదో వికెట్ ఇద్దరు కలిసి 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో భారత జట్టును ఒడ్డుకు చేర్చారు. భారత బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ 45 బంతుల్లో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కెఎల్ రాహుల్(22), శుబ్‌మన్ గిల్(20), విరాట్ కోహ్లీ(01) పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టగా కలీద్ అహ్మాద్, మెహిడీ హసన్ మిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News