Wednesday, January 22, 2025

రాహుల్ సెంచరీ… టీమిండియా 245 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 67.4 ఓవర్లలో 245 పరుగులు చేసి ఆలౌటైంది. కెఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. 137 బంతుల్లో 101 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఒక వైపు వికెట్లు పడతున్న మొక్కవోని దీక్షతో రాహుల్ పరుగులు చేశాడు. ఒక వైపు టెయిలెండర్లు ఉన్న ఓపికతో సెంచరీ చేయడం గ్రేట్. మహ్మాద్ సిరాజ్ ఐదు పరుగులు చేసి కోయిట్జ్ బౌలింగ్‌లో విర్రియ్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రసిద్ధ కృష్ణ నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా ఐదు వికెట్లు తీయగా బర్గర్ మూడు వికెట్లు, మార్కో జాన్సన్, కోయిట్జ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News