Wednesday, December 18, 2024

టీమిండియా 260 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: గబ్బా వేధికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 78.5 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది. చివరలో ఆకాశ్ దీప్ 31 పరుగులు చేసి హెడ్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 185 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెలుతురు తక్కువగా ఉండడంతో కొంచెం సేపు ఆటను నిలిపివేశారు. ప్లడ్ లైట్లు వేసిన తరువాత వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. ఈ రోజు 90 ఓవర్ల ఆట ఆడడం కష్టమేనని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. వేగంగా ఆడి భారత్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచాలని ఆసీస్ భావిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌ను డ్రా చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 445

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News