Monday, January 20, 2025

హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ…. భారత్ 296/5

- Advertisement -
- Advertisement -

Team India scored 295 runs for 5 wickets

హామీల్టన్: సీడన్ పార్క్ మైదానంలో మహిళా వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 296 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్మృతి మంధనా, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగారు. మూడో వికెట్ పై హర్మన్ ఫ్రీత్, మంధనా 184 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి మంధనా 123 పరుగులు చేసి కన్నెల్ బౌలింగ్ లో సెల్మన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. యాస్టికా భాటియా 31 పరుగులు చేసి సల్మెన్ బౌలింగ్‌లో మైదానం వీడింది. మిథాలీ రాజ్ ఐదు పరుగులు చేసి మ్యాథ్యూస్ బౌలింగ్ షమిలాకు క్యాచ్ ఇచ్చి ఔటయింది. దీప్తి శర్మ 15 పరుగులు చేసి మహ్మాద్ బౌలింగ్‌లో మ్యాథ్యూస్‌కు ఇచ్చి వెనుదిరిగింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐదు పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్(100), పూజ వత్ర్సాకర్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News