Sunday, January 19, 2025

రోహిత్, జైస్వాల్ సెంచరీ… టీమిండియా 312/2

- Advertisement -
- Advertisement -

డొమినికా: విండ్‌సోర్ పార్క్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 113 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ 221 బంతుల్లో 103 పరుగులు చేసి ఆలౌటయ్యాడు. యశస్వి జైస్వాల్ 350 బంతుల్లో 143 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నాడు. తొలి వికెట్‌పై ఇద్దరు కలిసి 229 పరుగుల భారీ భాగస్వామ్యం చేశారు. శుభ్‌మన్ గిల్ ఆరు పరుగులు చేసి వారికన్ బౌలింగ్‌లో అలిక్ అతంజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(36), జైస్వాల్(143) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే.

Also Read: చందమామ వస్తున్నాం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News