సూర్యకుమార్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం శుక్రవారం టీమిండియాను ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణకు తొలిసారి వన్డే జట్టులో చోటు కల్పించారు. పుణె వేదికగా ఈ నెల 23 నుంచి ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. దీని కోసం 18 మందితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించింది. నాలుగో వన్డేలో విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన యువ ఆటగాడు సూర్యకుమార్‌కు వన్డే సిరీస్‌లోనూ స్థానం దక్కింది. ఇక దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన స్పీడ్‌స్టర్ ప్రసిద్ధ్ కృష్ణకు కూడా జాతీయ జట్టులో చోటు లభించింది. వీరితో పాటు ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
అయితే విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన యువ ఓపెనర్ పృథ్వీషాకు మాత్రం జట్టులో స్థానం లభించక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక శుభ్‌మన్ గిల్, కెఎల్. రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లు జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కుల్దీప్ యాదవ్, సుందర్, చాహల్‌లకు కూడా స్థానం లభించింది. హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా వన్డే జట్టులోకి వచ్చాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ను కూడా జట్టుకు ఎంపిక చేశారు. అయితే మరో స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాకు మాత్రం వన్డే సిరీస్‌లోనూ విశ్రాంతి కల్పించారు. ఇక విరాట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా అతని డిప్యూటీ బాధ్యతలను రోహిత్ శర్మ నిర్వర్తించనున్నాడు.