Monday, November 18, 2024

టీమిండియాలో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

Team India support staff member tests positive

రిషబ్ పంత్, గరానిలకు పాజిటివ్
ఐసోలేషన్‌లో సాహా, ఈశ్వరన్. భరత్ అరుణ్

లండన్: టీమిండియాలో కరోనా కల్లోలం సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో ఓ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ధ్రువీకరించింది. ప్రస్తుతం పంత్ ఐసోలేషన్‌లో ఉన్నాడని వివరించింది. మరోవైపు జట్టు సహాయక సిబ్బంది సభ్యుడు దయానంద గరానికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో జట్టు త్రోడౌన్ నిపుణుడు గరానికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో అతనితో సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, స్టాండ్‌బై ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇక కౌంటీ జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఈశ్వరన్, సాహా దూరంగా ఉండనున్నాడు.

సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాలో కరోనా కేసులు బయటపడడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలావుండగా న్యూజిలాండ్‌తో డబ్లూటిసి ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియాకు 20 రోజుల విరామాన్ని కల్పించారు. దీంతో క్రికెటర్లు తమతమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇక యువ ఆటగాడు పంత్ మాత్రం యూరోకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూశాడు. ఇదే క్రమంలో అతనికి కరోనా సోకింది. ప్రస్తుతం అతనికి స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు వర్గాలు వెల్లడించాయి. ఇక క్రికెటర్లు ఇచ్చిన విరామ సమయం ముగియడంతో జట్టు సభ్యులు ఒక్కొక్కరూ డర్హమ్ చేరుకుంటున్నారు.

పంత్ మాత్రం వారం రోజుల తర్వాత జట్టు సభ్యులతో జతకలుస్తాడు. అప్పటి వరకు అతను ఐసోలేషన్‌లో ఉండక తప్పదు. ఇక త్వరలోనే భారత్‌ఇంగ్లండ్ జట్ల ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం 23 మందితో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా పంత్‌తో పాటు మరికొందరికీ కూడా కరోనా సోకినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీన్ని బిసిసిఐ ఖండించింది. జట్టులో ఒక్క పంత్ మాత్రమే కరోనా బారిన పడ్డాడని, మిగతావారికి నెగెటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. మరోవైపు యూరోకప్ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లిన పంత్ కరోనా నియమనిబంధనలను పాటించలేదు. అతను కనీసం మాస్క్‌ను కూడా ధరించలేదు. దీంతో కరోనా బారిన పడక తప్పలేదని బిసిసిఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News