Monday, December 23, 2024

యువ ఆటగాళ్లదే హవా

- Advertisement -
- Advertisement -

టి20ల్లో అద్భుతాలు చేసిన సంజూ శామ్‌సన్, అర్షదీప్ సింగ్
ఈ ఏడాది భారత్‌కు తీపి జ్ఞాపకాలే..
మనతెలంగాణ/ క్రీడావిభాగం: పొట్టీ క్రికెట్‌లో భారత్‌కు ఈ సంవత్సరం తీపి జ్ఞాపకాలను నిలుపుకుంది. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టైటిల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాట్‌తో విజృంభించే బ్యాటర్లు, బాల్‌తో మ్యాజిక్ చేసే బౌలర్లు వెలుగులోకి వచ్చారు. ఈ ఏడాది టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లను చాలానే ఉన్నారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ముందు వరుసలో నిలువగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తరువాతి వరుసలో నిలిచారు. ఇక బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌లు బాల్‌తో మెరిశారు.

సంజూ టాప్ స్కోరర్..

తొలుత ఫామ్‌లేమి కారణంగా భారత జట్టుకు దూరమైన స్టార్ ఓపెనర్ సంజుశామ్‌సన్ సయితం చెలరేగి బ్యాటింగ్ చేశాడు. బ్యాట్‌తో అద్భుతాలు చేసి సెలెక్టర్ల మన్ననలు పొందాడు. అంతేకాదు టి20 ఫార్మాట్‌లో సంజు శాంసన్‌కు మంచి రికార్డు లభించింది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెడ్డాడు. 13 మ్యాచ్‌లు ఆడిన సంజూ 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 436 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. 13 ఇన్నింగ్స్‌లో 31 సిక్సర్లు బాదాడు భారత క్రికెట్ అభిమానులు పరుగుల పండుగ అందజేశాడు. పొట్టి క్రికెట్ జట్టుకు యువ కెప్టెన్‌గా ఎన్నికైన సూర్యకుమార్ సయితం బ్యాట్ ఝలిపించాడు.

సూర్య 18 మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలతో సహా 429 పరుగులు చేసి భారత బ్యాటర్లలో రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 22 సిక్సర్లు కొట్టాడు. టి20 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపిన అనంతరం పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ఈ సంవత్సరం ఆడిన మ్యాచ్ ల్లోతనదైన ముద్ర వేశాడు. రోహిత్ 11 మ్యాచ్‌లలో 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక ఇటు బ్యాట్‌తో, అటు బాల్ రాణించే హార్దిక్ పాండ్య 17 మ్యాచ్‌లలో 352 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. పాండ్యా ఈ సంవత్సరం 19 సిక్సర్లు కొట్టాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో అతను 306 పరుగులు చేసిన తిలక్ వర్మ సయితం భారత్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. మరో స్టార్ బ్యాటర్, పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ కూడా పర్వాలేదనిపించాడు. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆకట్టుకున్న అక్షర్ పటేల్..

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సహకా రం మరువలేనిది. ఈ గుజరాతీ ఆటగాడు బ్యాట్‌తోనే కాకుండా స్పిన్ బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేశాడు. అక్షర్ పటేల్ ఈ ఏడాది మొత్తం టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున 16 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో అభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసకొని 22 వికెట్లు పడగొట్టాడు. 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇక, మణికట్టు స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ స్థానంలో టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టుకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అతని స్థానంలో రాజస్థాన్ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ నిలిచాడు. ఈ యువ స్పిన్నర్‌కు ఈ ఏడాది టీమిండియా తరఫున 16 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 22 వికెట్లు పడగొట్టాడు.

అర్షదీప్ సింగ్- 36 వికెట్లు..

2024 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఈ ఏడాది టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. ఈ సంవత్సరం భారతదేశం తరపున అత్యధిక టి20 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2024లో టి20ల్లో 18 మ్యాచ్‌లు ఆడిన అతను 36 వికెట్లు పడగొట్టి మమ అనిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News