- Advertisement -
పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ ఆధిక్యాన్ని సాధించింది. రాహుల్, జైస్వాల్ మంచి ఆధిక్యతను ఇండియా జట్టుకు అందించారు. రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభంలో టీమ్ ఇండియా ఓపెనర్లు నెమ్మదిగా మొదలెట్టారు. తర్వాత క్రీజులో నిలదొక్కుకుని మెల్లమెల్లగా దూకుడు పెంచారు. జైస్వాల్, రాహుల్ అర్ధ శతకాలు సాధించి నిలబడ్డారు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 90 పరుగులు, కెఎల్ రాహుల్ 62 పరుగులు సాధించారు. ఇండియా 218 పరుగుల ఆధిక్యతతో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరు 172/0 గా ఉంది. కరెంట్ రన్ రేట్: 3.02 గా ఉంది.
- Advertisement -