Sunday, December 22, 2024

టీమిండియా లక్ష్యం 241

- Advertisement -
- Advertisement -

కొలంబో: భారత్- శ్రీలంక మధ్య జరిగి రెండో వన్డేలో లంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 241 పరుగుల లక్ష్యాన్ని లంక ఉంచింది. లంక బ్యాట్స్‌మెన్లలో కమిండ్ మెండిస్(40), అవిష్క ఫెర్నాడో (40), దునిత్ వాల్లలాగే(39), కుశాల్ మెండిస్(30),  చరితా అసలంకా(25), అకిలా దనంజయ్(15) సదీరా సమరావిక్రమా (14), జనీత్ లియనాగే(12) పరుగులు చేశారు. టీమిండియాలో బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, మహ్మాద్ సిరాజ్, అక్షర పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.

 

 

 

 

Ind vs SL 2nd ODI Match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News