Thursday, January 23, 2025

టీమిండియా లక్ష్యం 107

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఇండియా మధ్య జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత జట్టు ముందు సౌతాఫ్రికా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఎయిడెన్ మార్కమ్ ఒక్కడే 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కేశవ్ మహారాజ్ 24 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బవుమా, రిలీ రోసో, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ల క్వింటన్ డికాక్ (1), కేశవ్ మహారాజ్(41), కగిసో రబడా(05) నాటౌట్, నోర్ట్జ్ (02) నాటౌట్ పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా దీపక్ చామర్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా అక్షర పటేల్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News