నెపియార్: మూడు టి20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ముందు కివీస్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అర్షదీప్ 18 ఓవర్లలో వరుసగా మూడు బంతుల్లో ముగ్గురిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా మిచెల్, సోధీ, సౌథీని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. కాన్వే, గ్లెన్ ఫిలీప్స్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
రెండు వికెట్‌పై ఇద్దరు కలిసి 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్లెన్ పిలీఫ్స్ 33 బంతుల్లో 54 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. కాన్వే 59 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిన్ అలెన్ మూడు పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. మార్క్ చాప్మాన్ 12 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. మిచెల్ పది పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, అర్షదీప్ సింగ్ చెరో నాలుగు వికెట్లు తీయగా హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.