Sunday, February 2, 2025

టీమిండియా లక్ష్యం 83

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: మహిళల అండర్ 19 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 20 ఓవరల్లో 82 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టు ముందు దక్షిణాఫ్రికా 83 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ బ్యాట్స్‌మెన్లు భారత్ బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోయారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో మైక్ వ్యాన్ వూస్ట్(23), జెమ్మా బోతా(16), ఫే కౌవ్‌లింగ్(15), కరబో మెసో(10), కయ్లి రెయ్‌నెకీ(07), డైరా రామ్‌లకన్(03), నీని(02, నాటౌట్) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. భారత బౌలర్లలో గోంగడి త్రిష మూడు వికెట్లు, పరుణిక సిసోడియా, అయుషి శుక్లా, వైష్ణవీ శర్మ తలో రెండో వికెట్లు తీయగా షబ్నమ్ ఎండి షకీల్ ఒక వికెట్ తీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News