- Advertisement -
ఢాకా: టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మరో 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 17 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. ఆగస్టు 26 నుంచి టి20 సిరీస్‌ను నిర్వహిస్తారు. వన్డే మ్యాచ్‌లకు మిర్పూర్‌లోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియడం ఆతిథ్యం ఇస్తోంది.
తొలి వన్డే ఆగస్టు 17న, రెండో వన్డే 20న, మూడో వన్డే ఆగస్టు 23న జరుగుతుంది. ఇక టి20 మ్యాచ్‌లకు చట్టొగ్రామ్ (చిట్టగాంగ్) వేదికగా నిలువ నుంది. మూడు మ్యాచ్‌లు కూడా ఇక్కడే జరుగుతాయి. తొలి టి20 ఆగస్టు 26న, రెండో టి20 29న, మూడో చివరి టి20 31న నిర్వహిస్తారు. సిరీస్‌కు సంబంధించిన వివరాలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం అధికారికంగా ప్రకటించింది.
- Advertisement -