Thursday, December 26, 2024

నవంబర్‌లో సౌతాఫ్రికా టూర్‌కు భారత్

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. 202425 సీజన్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత తలపడనుంది. సిరీస్‌లో భాగంగా టీమిండియా నాలుగు టి20 మ్యాచ్‌లను ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విడుదల చేసింది. నవంబర్ 8 నుంచి 15 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత్ తొలి టి20 మ్యాచ్‌ను నవంబర్ 8న ఆడనుంది. డర్బన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రెండో టి20 నవంబర్ 10న గేబేహాలో జరుగుతుంది. మూడో టి20 మ్యాచ్‌కు సెంచూరియన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ 13న జరుగనుంది. ఇక నాలుగో చివరి టి20 మ్యాచ్ 15న జోహెన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది. ఐసిసి వార్షిక షెడ్యూల్‌లో భాగంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News