Monday, December 23, 2024

సూర్య సునామీ… కుల్దీప్ కూల్చేశాడు… సిరీస్ సమం

- Advertisement -
- Advertisement -

జోహన్స్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా ఘన విజయం సాధించడంతో సిరీస్‌ను సమం చేసింది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయడంతో సఫారీలు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ 56 బంతుల్లో సెంచరీ చేసి సునామీ సృష్టించాడు. సూర్యకు తోడుగా యశస్వి జైశ్వాల్ 60 పరుగులు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ సఫారీ జట్టును కూల్చేశాడు. కుల్దీప్ 2.5 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు, ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ చెరో ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డెవిడ్ మిల్లర్ (35), ఎయిడెన్ మక్రమ్ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు రాణించకపోవడంతో ఓటమిని చవిచూశారు. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో సిరీస్ ను సమం చేశారు. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News