Sunday, November 24, 2024

భారత్‌దే టి20 సిరీస్..

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో టి20లో ఆతిథ్య టీమిండియా 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 31 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ జోష్ ఫిలిప్స్ (8) పరుగులు చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన హెడ్ 16 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేశాడు. అతన్ని అక్షర్ ఔట్ చేశాడు. అంతేగాక మెక్‌డెర్మాట్ (19), అరోన్ హార్డి (8)లను కూడా అక్షర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ కోలుకోలేక పోయింది. చివర్లో కెప్టెన్ మాథ్యూవేడ్ 23 బంతుల్లోనే రెండు సిక్సర్లు,

2 ఫోర్లతో అజేయంగా 36 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మిగతావారిలో టిమ్ డేవిడ్ (19), మాథ్యూ షార్ట్ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 16 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) మెరుపు ఆరంభాన్ని అందించారు. రింకూ సింగ్ (46) కూడా ధాటిగా ఆడాడు. ఇక ఆరంగేట్రం మ్యాచ్ ఆడిన జితేస్ శర్మ 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 బంత్లునే 35 పరుగులు చేశాడు. చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ స్కోరు 174 పరుగులకే పరిమితమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News