డొమినికా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్‌ను భారత్ బౌలర్లు 130 పరుగులకే కుప్పకూల్చారు. తొలి టెస్టుల మూడు రోజుల్లోనే ముగియడం గమనార్హం. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన విండీస్ ఈసారి మరింత తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్ (7), త్యాన్‌నారాయణ్ చందర్‌పాల్ (7) ఆరంభంలోనే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్లో వచ్చిన రేమన్ రిఫర్ (11), జర్మయిన్ బ్లాక్‌వుడ్ (5) కూడా జట్టును ఆదుకోలేక పోయారు. ఇక వికెట్ కీపర్ జోషువా (13) కూడా నిరాశ పరిచాడు. అలిక్ అతనాజే (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్ హోల్డర్ 20 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అల్జరీ జోసెప్ (13), వారికన్ (18) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 71 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు.