Thursday, January 23, 2025

విండీస్‌కు వైట్‌వాష్

- Advertisement -
- Advertisement -

Team India wins third T20 against west indies

రాణించిన సూర్య కుమార్, ఇషాన్ కిషన్
మూడో టి20లోనూ టీమిండియా గెలుపు

కోల్‌కతా : వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20లో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకంతో చెలరేగగా. ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ రాణించడంతో మూడో టి20లోనూ టీమిండియా ఘన విజయం సాదించింది. కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టి20లో 18 పరుగుల తేడాతో విజయం సాధించి, విండీస్‌కు వైట్‌వాష్ చేసిం . దీంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీ స్‌ను 30తో కైవసం చేసుకుంది. కాగా, బ్యాట్స్‌మెన్లు బౌలర్లు సమష్టిగా రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండి యా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

సూర్యకుమార్ యాదవ్ అర్థశతకతంతో(31 బంతుల్లో 65 పరుగులు) విజృంభించగా ఇషాన్ కిషాన్(31 బంతు ల్లో 34 పరుగులు)తో రాణించాడు. దీంతో విం డీస్ ముందు 185 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్. అనంతరం లక్ష ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌ లర్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల దా టికి ఆ జట్టులో నికోలన్ పూరన్ 61(47 బం తుల్లో), షెపార్డ్ 29(21 బంతుల్లో), పావెల్ 25 (14 బంతుల్లో) తప్ప మరెవరూ రాణించలేక పో యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కో ల్పోయి 167 పరుగులే చేసింది. భారత బౌలర్లలో హర్షలత్ పటేల్ 3 వికెట్లతో చెలరేగగా, దీపక్ చా హర్, వెంకటేశ్ అయ్యర్, శార్ధుల్ ఠాకూర్‌లు రెం డేసి వికెట్లు పడగొట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News