Sunday, January 19, 2025

బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

Team India won against Bangladesh

 

హైదరాబాద్ :టి20 ప్రపంచకప్ సూపర్12లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు దాదాపుగా బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత ఆటగాల్లు అద్భుతంగా ఆడారు. విరాట్‌ కోహ్లీ (64) రన్స్‌తో రాణించాడు. టోర్నీల్లో ఫామ్‌లో లోని కేఎల్‌ రాహుల్‌ కూడా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇక సూర్య కుమార్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో బంగ్లాదేశ్‌ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులకు కుదించారు.. అయితే నిర్ణీత పరుగులను చేసేందుకు చివరి వరకు పోరాడి చివరకు 145 పరుగులకే పరిమితమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News