Monday, December 23, 2024

టెస్టు సిరీస్ భారత్‌దే… డబ్ల్యుటిసి ఫైనల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: బోర్డర గావస్కర్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రా కావడంతో టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది. రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు గెలుచుకున్నారు. నాలుగు టెస్టులో భారీ శతకం బాదడంతో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియా ఐదో రోజు రెండు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసిన అనంతరం డిక్లెర్డ్ చేయడంతో డ్రాగా ముగిసింది. మొదటి రెండు టెస్టు టీమిండియా గెలవగా మూడో టెస్టు ఆసీస్ విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టులో కివీస్ విజయం సాధించడంతో టీమిండియా డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు కెన్ విలిమయ్స్ సెంచరీ చేయడంతో కివీస్ విజయం సాధించింది. కెన్ మామా దగ్గర ఉండి భారత జట్టును ప్రపంచ టెస్టు ఛాంపియన్‌లో అడుగు పెట్టేలా కృషి చేశారు.

ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్: 480
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 571

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News