ప్రపంచ క్రికెట్‌పై టీమిండియా ముద్ర
మన తెలంగాణ/క్రీడా విభాగం: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. కొ న్ని రోజుల క్రితం ఐసిసి టి20 ప్రపంచ కప్ గెలిచి న భారత్ తాజాగా ప్రతిష్ఠాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ రెండు ట్రోఫీలు ప్రపంచ క్రికెట్‌పై భారత్ ఆధిపత్యానికి నిదర్శనం. కిందటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో టీ మిండియా ట్రోఫీని దక్కించుకుంది. తాజాగా మినీ ప్రపంచకప్‌గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీని కూ డా కైవసం చేసుకుంది. ఈ రెండు విజయాలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ ఆధిపత్యానికి సంకేతంగా చెప్పొచ్చు.
పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాం పియన్స్ ట్రోఫీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూ డా కోల్పోకుండానే టైటిల్‌ను సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ప్రతి క్రికెటర్ తనవంతు పా త్రను సక్రమంగా పోషించాడు. దీంతో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌లను గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది. కొంత కాలంగా టి20, వన్డేలలో భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంది. అంతేగాక కొన్ని రోజుల క్రితం ఆసియా కప్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. సిరీస్ ఏదైనా విజయం సాధించడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో భారత్ ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది.
అజేయంగా నిలిచి..
ఐసిసి నిర్వహించిన మెగా టోర్నమెంట్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో అలరించింది. సమష్టిగా రాణి స్తూ ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. జ ట్టులోని ప్రతి ఆటగాడు తన బాధ్యతను సమర్థం గా పోషించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ నిలకడగా ఆడు తూ జట్టు విజయాల్లో తన వంతు సహకారం అందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి, అక్ష ర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కెఎల్ రా హుల్, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడే జా తదితరులు ఛాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ ఆటను కనబరిచారు.
కెఎల్ రాహుల్ రాహుల్, వి రాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శ్రేయస్, అక్షర్ పటేల్ తదితరులు కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. వీరందరూ సమష్టిగా రాణించడంతో భార త్ అజేయంగా నిలిచి ట్రోఫీని దక్కించుకుంది. బౌ లింగ్‌లో సీనియర్లు మహ్మద్ షమి, కుల్దీప్ యాద వ్, జడేజాలు సత్తా చాటారు. తొలి మ్యాచ్‌లో షమి ఐదు వికెట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి అండగా నిలిచాడు. జడేజా, హార్దిక్, అక్షర్‌లు కూడా నిలకడైన బౌలింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో రాణించడంతో భారత్ తన ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీని జత చేసుకుంది.