Monday, December 23, 2024

రెండో టెస్టు భారత్‌దే: సునీల్ గావస్కర్

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు 23 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా 55 పరుగులు చేసి ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికా వెన్నువిరిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారత్ 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి రోజు పేస్ బౌలర్లు విజృంభించడంతో 23 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చివరలో ఒక్క పరుగు కూడా చేయడకుండా ఆరు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

రెండో టెస్టుపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ స్పందించారు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయిందని, టీమిండియా ఇంకా ఆధిక్యంలో ఉండడంతో భారత్ పక్కా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న సఫారీ బ్యాటింగ్ ఆర్డర్ మిగిలిన ఆటగాళ్లు 150 నుంచి 200 పరుగులు చేయడం కష్టమైన పని కావడంతో టీమిండియా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇన్నింగ్స్ తేడాతో గెలవకపోయిన మెరుగైన స్థితిలో భారత్ ఉంటుందని గావస్కర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News