Sunday, November 24, 2024

అదరగొట్టిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

Team India won match by 8 wickets against Scotland

జడేజా, షమి మ్యాజిక్, రాహుల్ విధ్వంసం, భారత్ చేతిలో స్కాట్లాండ్ చిత్తు

దుబాయి: ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు ఇంకా మిగిలేవున్నాయి. భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ను భారత బౌలర్లు 85 పరుగులకే కుప్పకూల్చారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 6.3 ఓవర్లలోనే కేవల రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కెఎల్.రాహుల్,రోహిత్ శర్మలు టీమిండియాకు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు తొలి బంతి నుంచ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో స్కోరు సునామీలా పరిగెత్తింది. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 16 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలోనే తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు.

రాహుల్ వీరవిహారం..

మరో ఓపెనర్ కెఎల్.రాహుల్ వీర విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన రాహుల్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇదే సమయంలో ఈ వరల్డ్‌కప్‌లో అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. తొలి బంతి నుంచే విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన రాహుల్ 19 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, ఆరు బౌండరీలతో 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక సూర్యకుమార్ 6(నాటౌట్) సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కోహ్లి రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుని తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకుంది. టీమిండియా అంతర్జాతీయ టి20 చరిత్రలో ఇదే అత్యంత భారీ విజయంగా నిలిచింది.

జడేజా మాయ..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ కొయెట్జర్ (1)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ మున్సెను షమీ వెనక్కి పంపాడు. మున్సె 4 ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ క్రాస్ (2), బెర్రింగ్టన్ (0)లను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. దీంతో స్కాట్లాండ్ 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మైక్‌లాయిడ్ (16), లీస్క్ (21) కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ లీస్క్‌ను ఔట్ చేయడంతో ద్వారా జడేజా స్కాట్లాండ్‌ను మరోసారి దెబ్బతీశాడు. ఆ తర్వాత స్కాట్లాండ్ మళ్లీ తేరుకోలేక పోయింది. షమి ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ 85 పరుగులకే ముగిసింది. భారత బౌలర్లలో జడేజా, షమి మూడేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News