Monday, December 23, 2024

నాగ్‌పూర్ టెస్టు భారత్‌దే

- Advertisement -
- Advertisement -

 

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా గెలిచింది. ఇన్నింగ్స్‌తో పాటు 132 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి పేకమేడలా కూలిపోయింది. రవి చంద్ర అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ కకావికలమైంది. రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయజాలంతో ఐదు వికెట్లు తీసి ఆసీస్ వెన్నువిరిచాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్టీవెన్ స్మిత్ ఒక్కరే 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు 20 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేయలేదు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు డేవిడ్ వార్నర్(10), లబుసింగే(17), కారే(10) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా, షమీ, రెండు చెరో వికెట్లు, అక్షర పటేల్ ఒక వికెట్ తీశారు. రవీచంద్ర జడేజా ఈ టెస్టులో ఏడు వికెట్లు తీయడంతో పాటు 70 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 91
భారత్ తొలి ఇన్నింగ్స్: 400

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News