Friday, December 20, 2024

ఆసీస్ పై గెలిచిన టీమిండియా… రికార్డు సృష్టించిన మహిళా జట్టు

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో మహిళా విభాగంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌పై తొలి విజయం సాధించి టిమిండియా మహిళా జట్టు రికార్డు సృష్టించింది. గతంలో ఆసీస్‌ తో పది టెస్టులు ఆడినప్పటికి నాలుగు టెస్టులు ఆస్ట్రేలియా గెలవగా ఆరు టెస్టులు డ్రాగా ముగిశాయి. పదకొండో టెస్టులో మాత్రం టీమిండియా ఘన విజయం సాధించింది.

ఆస్ట్రేలియా మొదిటి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 406 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో పాటు భారీ స్కోరు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 261 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో 75 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచింది. టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టెస్టులో ఏడు వికెట్లు తీసిన స్నేహ రాణాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News