Sunday, December 22, 2024

ఫైనల్‌కు చేరిన భారత్

- Advertisement -
- Advertisement -

గయానా: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి పైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌పై 68 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. ఇంగ్లాండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో హరీ బ్రూక్(25), జోస్ బట్లర్ (23), జోఫ్రా ఆర్చర్(21), లివింగ్ స్టోన్(11), ఫిలిప్ సాల్డ్(5), మోయిన్ అలీ(8), శామ్ కరణ్(2), క్రిష్ జోర్డాన్(1), అదిల్ రషీద్(02), టాప్లే(03 నాటౌట్) పరుగులు చేసి ఔటయ్యారు. టీమిండియా బౌలర్లలో అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ప్రధానమైన మూడు వికెట్లు తీసిన అక్షర పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(57) చేయడంతో పాటు సూర్య కుమార్ యాదవ్ 47 పరుగులు చేయడంతో భారత జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News